Tuesday 1 January 2013

భక్తియోగము


మనము ఎన్నో పుస్తకాలను చదువుతాము. పాటలను వింటాము ఇట్లా మనసుకు ఆనందమైనటువంటివి మరియు ఆహ్లాదకరమైనటువంటివి మనము ఆనుభవిస్తాము. కాని విటిల్లో కొన్ని మాత్రమె మన హృదయానికి ఒత్తుకొనిపొతాయి. కాని భక్తిలో కలిగేటువంటి పారవశ్యం అసాధారణమైనది. ఆపారవశ్యంలొ మునిగితే కాని దాని ఆనందము తెలియదు. ఇది నోటితో చెప్పేదికాదు. మనందరికి భక్తి ఉండవచ్చు. కాని మనము ఆపారవశ్యాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా.
                         అటువంటి స్థితికి చేరాలంటె ఏం చేయాలి? ఏది దారి? బాబా మనకు ఒక చక్కటి మార్గం చూపించారు. అదే నవ విధభక్తి మార్గము. అనంతరావు పాటకర్ ద్వారా మనకి ఈ మార్గాన్ని భోదించి బాబా మనకు చాలా ఉపకారం చేసారు. ఇది ఏ సందర్భంలో చెప్పారో అని మనం పరిశీలించి చూస్తె, ఈ మార్గం ఎంత గోప్పదో మనకు అవగతం అవుతుంది.
                         ఒకసారి అనంతరావు పాటకర్, సాయి దర్శనానికై వచ్చి ఈ విధంగా మొరపెట్టుకున్నాడు. బాబా నేను చాలా పుస్తకాలు చదివాను. విన్నాను. ఉపనిషత్తులు వాటిభాష్యాలు, మన పవిత్ర గ్రంధాలు ఇలా చాలా పఠించడం జరిగింది. కాని నామనస్సులో ఏదొ వ్యాకులత. నేను చదివిన దంతా వృదా అనిపిస్తుంది. నేర్చుకున్నదానికి అర్ధం లేకుండా పోయింది. ఈ జపతపాదులు ఎందుకు? ఇవి మనశ్శాంతిని ఇవ్వడం లేదు. ఈ పరమాత్మ అనుభూతి పొందని ఈ సాధనలన్ని వ్యర్ధమేనా? అని దీనంగా అడగడం జరిగింది. నీ పాదపద్మములే నాకు గతి. నన్ను ఉద్ధరించు మహరాజా!
                  అప్పుడు బాబా ఒక కధ చెప్పడం జరిగింది. ఒక వర్తకుడు తోమ్మిది లడ్డులను తన పంచె కొంగులొ సేకరించెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగల్గెను, అని చెప్పారు.
                             దాని యొక్క అర్ధం తెలియక పాటంకర్, దాదా కేల్కరుని అడగడం జరిగింది. వీరిని అడ్డంపెట్టుకుని బాబా మనకు నవవిధభక్తిని ఇవ్వడం జరిగింది.

No comments:

Post a Comment